ఏపీ క‌రోనా బులిటెన్ విడుద‌ల‌

618 Corona Cases In AP. ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 618 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా

By Medi Samrat  Published on  9 Dec 2020 1:38 PM GMT
ఏపీ క‌రోనా బులిటెన్ విడుద‌ల‌

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 618 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ముగ్గురు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 7,045కు చేరగా, పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,73,457కు చేరింది. తాజాగా 785 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం రాష్ట్రంలో 5,259యాక్టివ్‌ కేసులున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,05,70,843 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరులో 76, గుంటూరులో 92, కృష్ణ‌లో 121 కేసులు, అనంత‌పూర్‌లో 50, ప‌శ్చిమ‌గోదావ‌రిలో 66 కేసులు నమోదు కాగా.. మిగతా జిల్లాల్లో యాభై‌ లోపు కేసులు నమోదయ్యాయి.


Next Story