సీఎం చంద్రబాబు అధ్యక్షతన 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్..ఇదే అజెండా!

సీఎం నారా చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది

By -  Knakam Karthik
Published on : 17 Dec 2025 10:32 AM IST

Andrapradesh, Amaravati, Cm Chandrababu, Collectors Conference, Deputy CM Pawankalyan

సీఎం చంద్రబాబు అధ్యక్షతన 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్..ఇదే అజెండా!

అమరావతి: సీఎం నారా చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో 5వ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ప్రారంభమైంది. సుపరిపాలన, సుస్థిరాభివృద్ధి, సంక్షేమం అజెండాగా రెండు రోజుల పాటు కలెక్టర్ల కాన్ఫరెన్స్ జరగనుంది. జీఎస్డీపీ లక్ష్యాలు, కీ పార్ఫెమెన్స్ ఇండికేటర్లు, సుస్థిరాభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చ జరగనుంది.

కేంద్ర నిధులను వివిధ ప్రభుత్వ శాఖలు ఏ విధంగా వినియోగించాయి... యూసీలను ఏ మేరకు జారీ చేశాయనే అంశాలపై సమీక్ష చేయనున్నారు. సూపర్ సిక్స్ పథకాల అమలు, ఇ-ఆఫీస్, డేటా డ్రివెన్ గవర్నెన్స్, ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో సీఎం చంద్రబాబు సమీక్షించనున్నారు. క్షేత్ర స్థాయిలో జిల్లా కలెక్టర్లు చేపట్టాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేయనున్నారు.కాగా ఈ కలెక్టర్ల కాన్ఫరెన్సుకు హజరైన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ సహా వివిధ శాఖల మంత్రులు హాజరయ్యారు.

Next Story