ఏపీలో స్వ‌ల్పంగా త‌గ్గిన క‌రోనా కేసులు.. 24 గంట‌ల్లో ఒక‌రు మృతి

495 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. రాష్ట్రంలో ఇవాళ కరోనా కేసులు

By Medi Samrat  Published on  18 Feb 2022 5:29 PM IST
ఏపీలో స్వ‌ల్పంగా త‌గ్గిన క‌రోనా కేసులు.. 24 గంట‌ల్లో ఒక‌రు మృతి

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ రాష్ట్రంలో కరోనా కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. రాష్ట్రంలో ఇవాళ కరోనా కేసులు సంఖ్య ఐదు వంద‌ల‌కు దిగువ‌న కేసులు నమోదయ్యాయి. కరోనా మరణాలు కూడా త‌గ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 22,383 పరీక్షలు నిర్వహించగా.. 495 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు శుక్ర‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,15,525కి చేరింది.

క‌రోనా వ‌ల్ల నిన్న ఒక‌రు మృత్యువాత ప‌డ్డారు. కోవిడ్ వల్ల చిత్తూరు జిల్లాలో ఒక్క రు మరణించారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,708గా ఉంది. 24 గంటల వ్యవధిలో 1,543 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 22,92,396 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 8,421 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,29,38,630 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.


Next Story