ఏపీలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో 64,800 శాంపిళ్లను పరీక్షించగా.. 4,872 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 17,63,211కి చేరింది. నిన్న 13,702 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 16,37,149కి పెరిగింది.
కోవిడ్ వల్ల పదమూడు మంది, గుంటూరు లో పది, అనంతపూర్ లో తొమ్మిది, శ్రీకాకుళం లో తొమ్మిది, విజయనగరం లో ఏడుగురు, పశ్చిమ గోదావరి లో ఏడుగురు, ప్రకాశం లో ఆరుగురు, విశాఖపట్నం లో ఆరుగురు, తూర్పు గోదావరి లో ఐదుగురు, కృష్ణలో ఐదుగురు, కర్నూల్ లో ఐదుగురు, నెల్లూరులో నలుగురు చొప్పున మొత్తం 86 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 11,552కి చేరింది. ఇక రాష్ట్రంలో 1,14,510 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 1,98,56,521 సాంపిల్స్ ని పరీక్షించారు.