ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 479 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, న‌లుగు‌రు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 7074కు చేరగా, పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,78,285కు చేరింది. తాజాగా 497 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం రాష్ట్రంలో 4355 యాక్టివ్‌ కేసులున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,11,96,574 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరులో 87, గుంటూరులో 62, కృష్ణ‌లో 92 కేసులు నమోదు కాగా.. మిగతా జిల్లాల్లో త‌క్కువ సంఖ్య‌లో కేసులు న‌మోద‌య్యాయి.


సామ్రాట్

Next Story