ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గ‌డిచిన 24 గంట‌ల్లో 80,712 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 4,684 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ బుధ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 18,62,036కి చేరింది. నిన్న 7,324 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 17,98,380కి పెరిగింది.

కోవిడ్ వల్ల చిత్తూర్ లో ఎనిమిది, తూర్పు గోదావరి లో ఐదుగురు, కృష్ణ లో ఐదుగురు, అనంతపూర్ లో ముగ్గురు, నెల్లూరు లో ముగ్గురు, శ్రీకాకుళం లో ముగ్గురు, కర్నూల్ లో ఇద్దరు, ప్రకాశం లో ఇద్దరు, విశాఖపట్నం లో ఇద్దరు, గుంటూరు లో ఒక్క రు, వైఎస్ఆర్ కడప లో ఒక్కరు, పశ్చిమ గోదావరి లో ఒక్కరు చొప్పున 36 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12,452కి చేరింది. ఇక రాష్ట్రంలో 51,204 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,13,61,014 సాంపిల్స్ ని పరీక్షించారు.
సామ్రాట్

Next Story