ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్నటితో పోల్చితే కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 30,022 పరీక్షలు నిర్వహించగా.. 4,570 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు ఆదివారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,06,280కి చేరింది. కరోనా వల్ల నిన్న చిత్తురు జిల్లాలో ఒకరు మరణించారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,510గా ఉంది. 24 గంటల వ్యవధిలో 669 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,65,000కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 26,770 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,18,62,032 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.