సీఎం అధ్యక్షతన సీఆర్డీయే సమావేశం.. 23 అంశాలకు అధారిటీ ఆమోదం
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీయే 41వ అధారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 23 అంశాలకు అధారిటీ ఆమోదం తెలిపింది.
By Medi Samrat Published on 2 Dec 2024 9:15 PM ISTసీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీయే 41వ అధారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మొత్తం 23 అంశాలకు అధారిటీ ఆమోదం తెలిపింది. రాజధానిలో కీలకమైన భవనాలు,రోడ్లు,వరద నివారణ పనులు చేపట్టేందుకు నిధులు కేటాయిస్తూ అధారిటీ పాలనాపరమైన అనుమతులు ఇచ్చింది.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం మూడు ముక్కలాటతో అమరావతిని నిర్వీర్యం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పలు కమిటీలు వేసి నివేదికల ఆధారంగా ముందుకెళ్తున్నామని తెలిపారు. 11,467 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచెందుకు అధారిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
360 కిమీల ట్రంక్ రోడ్లలో రూ2,498 కోట్లతో కొన్ని రోడ్లకు పనులు ప్రారంభానికి.. వరద నివారణకు 1585 కోట్లతో పాల వాగు, కొండవీటి వాగు, గ్రావిటీ కెనాల్ తో పాటు రిజర్వాయర్లు నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు తెలిపారు. గెజిటెడ్, నాన్ గెజిటెడ్, క్లాస్ -4, అల్ ఇండియా సర్వీస్ అధికారుల భవనాలు పనులను రూ3523 కోట్లతో చేపట్టేందుకు అధారిటీ ఆమోదం తెలిపిందని వివరించారు. రైతులకు ఇచ్చిన రిటర్ణబుల్ లే అవుట్ లలో రోడ్లు, మౌళిక వసతుల కల్పనకు 3859 కోట్లకు అనుమతి వచ్చిందని తెలిపారు. ఆయా పనులకు వెంటనే టెండర్లు పిలిచి జనవరి నుంచి పనులు ప్రారంభిస్తామని తెలిపారు. Undar ground డ్రైనేజీ, స్ట్రీట్ లైట్స్, తాగు నీరు, ల్యాండ్ స్పింగ్.. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో చేయాలని సీఎం ఆదేశించారని తెలిపారు. 5 ఐకానిక్ టవర్లు, అసెంబ్లీ, హై కోర్టు భవనాలు డిజైన్లకు టెండర్లు పిలిచామని తెలిపారు.
డిసెంబర్ నెలాఖరుకు ఐకానిక్ భవనాలకు టెండర్లు పిలుస్తామని వెల్లడించారు. గత ప్రభుత్వం రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెట్టిందని.. ఆడవారిని కూడా హింసించారని.. రాజధాని అమరావతిలో ఉండకూడదని ప్రయత్నం చేశారన్నారు. 5 కోట్ల మంది రాష్ర్ట ప్రజలకు మాట ఇచ్చిన ప్రకారం రాబోయే మూడేళ్లలో అమరావతిని పూర్తి చేస్తామన్నారు.