ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ ఆగడం లేదు. రాష్ట్రంలో ఇవాళ కూడా కరోనా కేసులు సంఖ్య 4 వేలకుపైగా నమోదయ్యాయి. నిన్నటితో పోల్చితే ఇవాళ కరోనా మరణాలు కాస్తా తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 30,886 పరీక్షలు నిర్వహించగా.. 4,198 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,97,369కి చేరింది.
కరోనా వల్ల నిన్న ఐదుగురు మృత్యువాత పడ్డారు. కోవిడ్ వల్ల చిత్తూరులో ఇద్దరు, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పు న మరణించారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,646గా ఉంది. 24 గంటల వ్యవధిలో 9,317 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 21,94,359 కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 88,364 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,26,02,251 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.