ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్నటితో పోల్చితే కేసులు భారీగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 41,954 పరీక్షలు నిర్వహించగా.. 3,205 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు బుధవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,87,879కి చేరింది. కరోనా వల్ల నిన్న నిన్న ఎటువంటి మరణం సంభవించలేదు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,505గా ఉంది. 24 గంటల వ్యవధిలో 281 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,63,255కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 10,119 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,17,08,637 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.