ఏపీలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు

310 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 23,022

By Medi Samrat  Published on  11 Oct 2021 7:12 PM IST
ఏపీలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు, మ‌ర‌ణాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 23,022 పరీక్షలు నిర్వహించగా.. 310 కేసులు నిర్ధారణ అయిన‌ట్లు సోమ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,57,562కి చేరింది. నిన్న క‌రోనా వ‌ల్ల ఇద్ద‌రు ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,256కి చేరింది. 24 గంటల వ్యవధిలో 994 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,36,048కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,258 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,87,67,963 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.



Next Story