ఏపీలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు

305 Corona Cases In AP. ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 305 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా

By Medi Samrat  Published on  14 Dec 2020 11:11 AM GMT
ఏపీలో భారీగా త‌గ్గిన క‌రోనా కేసులు

ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 305 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఇద్ద‌రు మరణించారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో మృతుల సంఖ్య 7,059కు చేరగా, పాజిటివ్‌ కేసుల సంఖ్య 8,75,836కు చేరింది. తాజాగా 541 మంది కరోనా నుంచి కోలుకోగా, ప్రస్తుతం రాష్ట్రంలో 4,728 యాక్టివ్‌ కేసులున్నట్లు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,08,75,925 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు తెలిపింది. ఇక గడిచిన 24 గంటల్లో అత్యధికంగా చిత్తూరులో 43, కృష్ణ‌లో 37 కేసులు, ప‌శ్చిమ‌గోదావ‌రిలో 45 కేసులు నమోదు కాగా.. మిగతా జిల్లాల్లో త‌క్కువ సంఖ్య‌లో కేసులు న‌మోద‌య్యాయి.


Next Story