నిన్నటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 1,00,103 శాంపిళ్లను పరీక్షించగా.. 3,040 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,17,253కి చేరింది. నిన్న 4,576 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,73,993కి పెరిగింది.
కోవిడ్ వల్ల తూర్పు గోదావరి లో నలుగురు, చిత్తూర్ లో ఇద్దరు, అనంతపూర్, గుంటూరు, కృష్ణ, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, పశ్చిమ గోదావరిలలో ఒక్కొక్క రు చొప్పున మొత్తం 14 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 12,960కి చేరింది. ఇక రాష్ట్రంలో 30,300 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 2,27,99,245 సాంపిల్స్ ని పరీక్షించారు.