ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ.. రాజీనామా చేసిన 24 మంది మంత్రులు

24 Cabinet Ministers resignation in Andhra Pradesh.సీఎం జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 April 2022 5:58 PM IST
ముగిసిన ఏపీ కేబినెట్‌ భేటీ.. రాజీనామా చేసిన 24 మంది మంత్రులు

సీఎం జ‌గ‌న్ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన రాష్ట్ర మంత్రివ‌ర్గ స‌మావేశం ముగిసింది. ఏప్రిల్ 11న మంత్రి వ‌ర్గాన్ని పున‌ర్ వ్య‌వ‌స్థీక‌రిస్తున్న నేప‌థ్యంలోని కేబినేట్‌లోని 24 మంది మంత్రులు రాజీనామా చేశారు. మంత్రులు త‌మ రాజీనామా లేఖ‌ల‌ను సీఎం జ‌గ‌న్ కు అంద‌జేశారు. రాజీనామా చేసిన మంత్రులు ఇంటికి వెళ్లేట‌ప్పుడు ప్ర‌భుత్వం త‌మ‌కు ప్ర‌భుత్వం కేటాయించిన కాన్వాయ్‌ల‌ను కూడా వ‌దిలేసి త‌మ సొంత వాహ‌నాల్లో బ‌య‌లుదేరారు.

ఆళ్లనాని, ధర్మాన కృష్ణదాస్‌, పాముల పుష్ప శ్రీవాణి, కే నారాయణ స్వామి, అంజద్‌ బాషా, సుచరిత, బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, శంకర్‌ నారాయణ, బాలినేని శ్రీనివాస్‌ రెడ్డి, ఆదిమూలపు సురేశ్‌, అనిల్‌ కుమార్‌ యాదవ్‌, కొడాలి నాని, పేర్ని నాని, వెల్లంపల్లి శ్రీనివాస్‌, తానేటి వనిత, రంగనాథ రాజు, అవంతి శ్రీనివాస్‌రావు, కన్నబాబు, పిన్నపి విశ్వరూప్‌, గమ్మనూర్‌ జయరాం, గోపాల కృష్ణ, సిదిరి అప్పలరాజు లు రాజీనామా చేసిన వారిలో ఉన్నారు.

ఇక కేబినేట్ స‌మావేశంలో ఆమోదం తెలిపిన అంశాలు

- డిగ్రీ క‌ళాశాలల్లో 574 టీచింగ్‌, నాన్ టీచింగ్ పోస్టుల భ‌ర్తీకి ఆమోదం.

- జ‌డ్పీల కాల‌ప‌రిమితి ముగిసే వ‌ర‌కు కొన‌సాగించేందుకు పంచాయ‌తీరాజ్ చ‌ట్ట స‌వ‌ర‌ణ ఆర్డినెన్స్‌కు ఆమోదం

- రాష్ట్రంలో మిల్లెట్ పాల‌సీని తీసుకువ‌చ్చేందుకు వ్య‌వ‌సాయ‌శాఖ ప్ర‌తిపాదించ‌గా.. ఆమోదం

-కొత్త రెవెన్యూ డివిజ‌న్ల‌కు ఆమోద‌ముద్ర‌

-రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో హోట‌ల్ క‌మ్ క‌న్వెక్ష‌న్ సెంట‌ర్ కోసం ఏపీ టూరిజం కార్పొరేష‌న్‌కు 6 ఎక‌రాలు ఉచితంగా కేటాయింపు, క‌ర్నూలులోని కొలిమిగుండ‌ల్లో పారిశ్రామిక పార్కుకు 82 ఎక‌రాల కేటాయింపుల‌కు ఆమోదం

Next Story