నిన్నటితో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 81,740 శాంపిళ్లను పరీక్షించగా.. 2,345 పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం సాయంత్రం విడుదల చేసిన బులిటెన్‌లో వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,34,450కి చేరింది. నిన్న 3,001 మంది కరోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 18,96,499కి పెరిగింది.
కోవిడ్ వల్ల గుంటూరు లో ముగ్గురు, అనంతపూర్ లో ఇద్దరు, చిత్తూర్ లో ఇద్దరు, తూర్పుగోదావరి లో ఇద్దరు, కృష్ణ లో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, ప్రకాశం లో ఇద్దరు, విశాఖపట్నం లో ఒక్కరు చొప్పున 16 మంది మరణించారు. దీంతో రాష్ట్రంలో కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,097కి చేరింది. ఇక రాష్ట్రంలో 24,854 యాక్టివ్ కేసులు ఉండగా.. నేటి వరకు రాష్ట్రంలో 2,33,96,437 సాంపిల్స్ ని పరీక్షించారు.