ఏపీ క‌రోనా బులిటెన్‌.. పెరిగిన కేసులు, మ‌ర‌ణాలు

2174 New Corona Cases Reported AP. నిన్న‌టితో పోలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగాయి. గ‌డిచిన 24

By Medi Samrat  Published on  24 July 2021 11:54 AM GMT
ఏపీ క‌రోనా బులిటెన్‌.. పెరిగిన కేసులు, మ‌ర‌ణాలు

నిన్న‌టితో పోలిస్తే ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో క‌రోనా కేసుల సంఖ్య స్వ‌ల్పంగా పెరిగాయి. గ‌డిచిన 24 గంట‌ల్లో 74,820 శాంపిళ్ల‌ను పరీక్షించ‌గా.. 2,174 పాజిటివ్ కేసులు న‌మోదు అయిన‌ట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ శ‌నివారం సాయంత్రం విడుద‌ల చేసిన బులిటెన్‌లో వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య 19,52,513కి చేరింది. నిన్న 2,737 మంది క‌రోనా నుంచి కోలుకోగా.. మొత్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,16,914కి పెరిగింది.

కోవిడ్ వల్ల కృష్ణ లో ఐదుగురు, చిత్తూర్ లో నలుగురు, తూర్పు గోదావరి లో ఇద్దరు, ప్రకాశం లో ఇద్దరు, పశ్చిమ గోదావరి లో ఇద్దరు, నెల్లూరు లో ఒక్క రు, శ్రీకాకుళం లో ఒక్కరు, విశాఖపట్నం లో ఒక్కరు చొప్పున 18 మంది మ‌ర‌ణించారు. దీంతో రాష్ట్రంలో క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 13,241కి చేరింది. ఇక రాష్ట్రంలో 22,358 యాక్టివ్ కేసులు ఉండ‌గా.. నేటి వరకు రాష్ట్రంలో 2,40,50,103 సాంపిల్స్ ని పరీక్షించారు.


Next Story
Share it