ఏపీ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

184 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా

By Medi Samrat
Published on : 1 Dec 2021 12:05 PM

ఏపీ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా వ్యాప్తి కొన‌సాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 29,595 పరీక్షలు నిర్వహించగా.. 184 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు బుధ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,73,093కి చేరింది. క‌రోనా వ‌ల్ల నిన్న ఒక్క‌రు మృతిచెందారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,443గా ఉంది. 24 గంటల వ్యవధిలో 183 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,56,501కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,149 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,04,46,677 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.



Next Story