ఏపీలో క‌రోనా విజృంభ‌ణ‌.. నిన్న‌టితో పోల్చితే రెట్టింపు కేసులు

1831 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న‌టితో పోల్చితే కేసులు దాదాపు రెట్టింప‌య్యాయి

By Medi Samrat
Published on : 11 Jan 2022 5:40 PM IST

ఏపీలో క‌రోనా విజృంభ‌ణ‌.. నిన్న‌టితో పోల్చితే రెట్టింపు కేసులు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. నిన్న‌టితో పోల్చితే కేసులు దాదాపు రెట్టింప‌య్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 36,452 పరీక్షలు నిర్వహించగా.. 1,831 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు మంగ‌ళ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,84,674కి చేరింది. క‌రోనా వ‌ల్ల నిన్న నిన్న ఎటువంటి మ‌ర‌ణం సంభ‌వించ‌లేదు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,505గా ఉంది. 24 గంటల వ్యవధిలో 242 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,62,974కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 7,195 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,16,66,683 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.


Next Story