15 నుంచి ఇంటింటీకీ 'మన మిత్ర'

ప్రజల చేతిలో ప్రభుత్వం అనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం మన మిత్రపేరుతో తీసుకొచ్చిన వాట్సాప్ గవరెన్స్ నంబరు 9552300009 రాష్ట్రంలోని పౌరులందరూ తమ మొబైల్ ఫోన్లలో మనమిత్ర పేరుతో తప్పనిసరిగా సేవ్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విజప్తి చేసింది.

By Medi Samrat
Published on : 8 April 2025 6:13 PM IST

15 నుంచి ఇంటింటీకీ మన మిత్ర

ప్రజల చేతిలో ప్రభుత్వం అనే ఆశయంతో రాష్ట్ర ప్రభుత్వం మన మిత్రపేరుతో తీసుకొచ్చిన వాట్సాప్ గవరెన్స్ నంబరు 9552300009 రాష్ట్రంలోని పౌరులందరూ తమ మొబైల్ ఫోన్లలో మనమిత్ర పేరుతో తప్పనిసరిగా సేవ్ చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు విజప్తి చేసింది. ప్రజలెవ్వరూ కూడా తమ పనుల కోసం తమకు కావాల్సిన ధ్రువీకరణ పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా కేవలం తామున్న చోటునుంచే తమ సెల్ ఫోనులోని మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా క్షణాల్లో ప్రభుత్వం నుంచి తమకు కావాల్సిన సేవలు పొందే సదుపాయాన్ని ప్రభుత్వం పౌరులకు కల్పిస్తోంది.

ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు ఆశ‌యాల‌క‌నుగుణంగా ఐటీ మ‌రియు ఆర్టీజీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచ‌న‌ల నుంచి వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ అనే వినూత్న సౌలభ్యాన్ని ప్ర‌భుత్వం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది. మ‌న మిత్ర పేరుతో మెటా వారి స‌హ‌కారంతో తీసుకొచ్చిన ఈ వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ఇప్ప‌టికే ప్ర‌జామ‌న్న‌నలు చూర‌గొంటోంది. దీన్ని ప్రజలకు మరింత చేరువగా తీసుకెళ్లే దిశగా ప్ర‌భుత్వం విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 15వ తేదీ నుంచి ఇంటింటికీ మన మిత్ర పేరిట స్పెషల్ డ్రైవ్ నిర్వహించనుంది.

ఈ కార్యక్రమంలో భాగంగా అన్ని జిల్లల్లోని సచివాలయ సిబ్బంది త‌మ‌ సచివాలయ పరిధిలోని ప్రతి ఇంటికీ వెళ్లీ ఆ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరి మొబైల్ ఫోనులో మనమిత్ర పేరిట వాట్సాప్ గవర్నెన్స్ నంబరు 9552300009 సేవ్ చేయిస్తారు. అలాగే ఈ వాట్సాప్ గవర్నెన్స్ ను ఎలా ఉపయోగించాలి, దాని ద్వారా ప్రభుత్వ సేవలు ఎలా పొందాలి అనే దానిపైన ఆ కుటుంబంలో ఉన్నవారంద‌రికీ అవగాహన కల్పిస్తారు.

మన మిత్ర.. ఉపయోగించడం ఎంతో సులువు.

• సేవ్ – ముందుగా మీ మొబైల్ ఫోనులో 9552300009 మన మిత్ర పేరిట సేవ్ చేసుకోండి

• “హాయ్” – ఆ నంబరుకు “హాయ్” అని సందేశం పంపండి

• మీకు కావలసిన సేవను ఎంపిక చేసుకోండి

• వెంటనే మీకు వాట్సాప్ లో ఏఐ ఆధారిత చాట్ బాట్ లో లభ్యమయ్యే అన్ని ప్రభుత్వ సేవల జాబితా కనిపిస్తుంది.

• అందులో మీరు ఒక సేవను ఎంపిక చేసుకోండి లేదా వాయిస్ కమాండ్స్ ను కూడా ఉపయోగించుకోవచ్చు. (ఉదాహరణకు “ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్”)

• కావాల్సిన వివరాలు పొందుపరచండి

• మీరు కోరుకున్న సేవకు సంబంధించి చాట్ బాట్ మరికొన్ని అదనపు వివరాలను అడగొచ్చు. ఉదాహరణకు మీ ఆధార్ నంబరు, మీ మొబైల్ నంబరు, లేదా సర్వీసు రిక్వెస్టు ఐడీ లాంటివి.

• ఈ వివరాలను మీరు టెక్ట్స్ రూపంలో కానీ లేదా వాయిస్ రూపంలోనైనా ఇవ్వండి

• సర్వీస్ కన్ఫర్మేషన్ పొందండి

• మీరిచ్చిన వివరాలను ఒకసారి తనిఖీ చేసిన తర్వాత, అందులో సిస్టమ్ మీకు రియల్-టైమ్ అప్డేట్స్ లేదా ఒక కన్ఫర్మేషన్ సందేశాన్ని పంపుతుంది

• మీరు జరిపిన లావాదేవీలకు సంబంధించి డిజిటల్ కాపీ లేదా రశీదును డౌన్లోడు చేసుకోండి

• వాట్సాప్ గవర్నెన్స్ లోని చాట్ బాట్ మీకు ఈ-ధ్రువీకరణ పత్రాలు, రశీదులు, లేదా అక్నాలెడ్జిమెంట్లను రూపొందించి అందజేస్తుంది.

Next Story