ఏపీ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

1515 New Corona Cases Reported In AP. ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 68,865 పరీక్షలు నిర్వహించగా..

By Medi Samrat  Published on  27 Aug 2021 4:31 PM IST
ఏపీ క‌రోనా బులిటెన్‌.. కొత్త‌గా ఎన్ని కేసులంటే..

ఆంధ్రప్రదేశ్‌లో గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 68,865 పరీక్షలు నిర్వహించగా.. 1,515 కేసులు నిర్ధారణ అయ్యాయి. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 20,09,245 మంది వైరస్‌ బారినపడినట్లు రాష్ట్ర వైద్యరోగ్య శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొవిడ్‌ వల్ల 10 మంది బాధితులు ప్రాణాలు కోల్పోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 13,788కి చేరింది. 24 గంటల వ్యవధిలో 903 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 19,80,407కి చేరినట్లు వైద్యారోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో 15,050 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,64,06,811 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.



Next Story