ఏపీలో క‌రోనా కల్లోలం.. భారీగా న‌మోదైన‌ కేసులు, మ‌ర‌ణాలు

14502 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో రోజు రోజుకు క‌రోనా

By Medi Samrat  Published on  24 Jan 2022 11:56 AM GMT
ఏపీలో క‌రోనా కల్లోలం.. భారీగా న‌మోదైన‌ కేసులు, మ‌ర‌ణాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో రోజు రోజుకు క‌రోనా కేసులు సంఖ్య పెరుగుతోంది. ఇవాళ కూడా కేసుల సంఖ్య భారీగానే న‌మోద‌య్యింది. పండ‌గ‌కు ముందు రాష్ట్రంలో మ‌ర‌ణాలు న‌మోదు కాలేదు. కేసులు పెర‌గ‌డంతో మ‌ర‌ణాలు కూడా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 40,266 పరీక్షలు నిర్వహించగా.. 14,502 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు సోమ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,95,136కి చేరింది.

క‌రోనా వ‌ల్ల నిన్న ఏడుగురు మంది మృత్యువాత ప‌డ్డారు. కోవిడ్ వల్ల పశ్చిమ గోదావరిలో ఇద్దరు, గుంటూరు, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం మరియు విశాఖపట్నంలలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,549గా ఉంది. 24 గంటల వ్యవధిలో 4,800 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,87,282కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 93,305 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,21,87,297 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.


Next Story