ఏపీ క‌రోనా బులిటెన్‌.. టెన్ష‌న్ పెడుతున్న కేసులు, మ‌ర‌ణాలు

13618 New Corona Cases Reported In AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. నిన్న‌టితో పోల్చితే ఈ రోజు

By Medi Samrat  Published on  26 Jan 2022 7:20 PM IST
ఏపీ క‌రోనా బులిటెన్‌.. టెన్ష‌న్ పెడుతున్న కేసులు, మ‌ర‌ణాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. నిన్న‌టితో పోల్చితే ఈ రోజు రాష్ట్రంలో కేసులు సంఖ్య స్వ‌ల్పంగా త‌గ్గాయి. పండ‌గ‌కు ముందు రాష్ట్రంలో మ‌ర‌ణాలు న‌మోదు కాలేదు. కేసులు పెర‌గ‌డంతో మ‌ర‌ణాలు కూడా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 49,143 పరీక్షలు నిర్వహించగా.. 13,618 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు బుధ‌వారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,22,573కి చేరింది.

క‌రోనా వ‌ల్ల నిన్న తొమ్మిది మంది మృత్యువాత ప‌డ్డారు. కోవిడ్ వల్ల తూర్పుగోదావ‌రి జిల్లాలో ఇద్ద‌రు, నెల్లూరు జిల్లాలో ఇద్ద‌రు, విశాఖపట్నం జిల్లాలో ఇద్ద‌రు, చిత్తూరు, శ్రీకాకుళం, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల‌లో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,570గా ఉంది. 24 గంటల వ్యవధిలో 8,687 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 21,01,685కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,06,318 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,22,83,369 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.


Next Story