ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 15,654 పరీక్షలు నిర్వహించగా.. 136 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు ఆదివారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 23,17,741కి చేరింది. కరోనా వల్ల నిన్న ఒక్కరోజే ఒకరు మృత్యువాత పడ్డారు. కోవిడ్ వల్ల చిత్తూరు ఒక్కరు మరణించారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి మరణించిన వారి సంఖ్య 14,726గా చేరింది. 24 గంటల వ్యవధిలో 803 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 23,00,165కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 2,850 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,30,97,641 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.