ఏపీ కరోనా బులిటెన్‌.. కొత్తగా ఎన్నికేసులంటే.!

13212 New corona cases reported in AP. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో రోజు రోజు క‌రోనా కేసులు సంఖ్య పెరుగుతోంది.

By అంజి  Published on  21 Jan 2022 1:05 PM GMT
ఏపీ కరోనా బులిటెన్‌.. కొత్తగా ఎన్నికేసులంటే.!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. రాష్ట్రంలో రోజు రోజు క‌రోనా కేసులు సంఖ్య పెరుగుతోంది. ఇవాళ కూడా కేసుల సంఖ్య పెరిగింది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 44,516 పరీక్షలు నిర్వహించగా.. 13,212 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయిన‌ట్లు శుక్రవారం సాయంత్రం విడుద‌ల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్ల‌డించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 21,53,268కి చేరింది. క‌రోనా వ‌ల్ల ఐదుగురు మంది మృత్యువాత ప‌డ్డారు. కోవిడ్ వల్ల విశాఖపట్నంలో ముగ్గురు, చిత్తూరు, నెల్లూరులో ఒక్కొక్కరు చొప్పున మరణించారు. రాష్ట్రంలో క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,532గా ఉంది. 24 గంటల వ్యవధిలో 2,942 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,74,600కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 64,136 యాక్టివ్‌ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,20,56,618 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.


Next Story
Share it