తీవ్రవాద దాడిని ఎదుర్కోవడంలో ధైర్యం చూపినందుకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా పొన్నం గ్రామానికి చెందిన 13 ఏళ్ల గురుగు హిమప్రియ ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్-2022కి ఎంపికైంది. ఫిబ్రవరి 2018లో జమ్మూలోని సుంజువాన్ మిల్ క్యాంప్‌లోని హిమప్రియ నివాసంపై.. ఆర్మీ జవాన్‌గా ఉన్న ఆమె తండ్రి లేని సమయంలో ఒక ఉగ్రవాది దాడి చేశాడు. గ్రెనేడ్‌ల దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ ఆమె దాదాపు 5 గంటలపాటు తీవ్రవాదితో సంభాషణలో నిమగ్నమై అపారమైన ధైర్యసాహసాలను ప్రదర్శించిందని ఉదహరించారు. హిమప్రియ తీవ్రవాదితో చర్చలు జరిపి తద్వారా కుటుంబాలను లక్ష్యంగా చేసుకోకుండా నిరోధించింది. "హిమప్రియ ధైర్యసాహసం ప్రదర్శించడంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు.. ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్-2022ను ప్రదానం చేస్తున్నారు" అని ఉదహరించారు.