ఏపీ కరోనా బులిటెన్ విడుదల.. భారీగా పెరిగిన కేసులు
11698 New Corona Cases Reported In AP. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ మహమ్మారి
By Medi Samrat Published on 24 April 2021 6:48 PM IST
ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తోంది. గత కొద్ది రోజులుగా ఈ మహమ్మారి బారిన పడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో 50,972 పరీక్షలు నిర్వహించగా.. 11,698 కేసులు నిర్ధరాణ అయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన పాజటివ్ కేసుల సంఖ్య 10,20,926 కు చేరింది. అత్యధికంగా శ్రీకాకుళం జిల్లాలో 1,641 కేసులు నమోదు కాగా.. అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 292 కేసులు చొప్పున నమోదు అయ్యాయి.
#COVIDUpdates: 24/04/2021, 10:00 AM
— ArogyaAndhra (@ArogyaAndhra) April 24, 2021
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 10,18,031 పాజిటివ్ కేసు లకు గాను
*9,28,944 మంది డిశ్చార్జ్ కాగా
*7,616 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 81,471#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/HxjVpDkTwq
కోవిడ్ వల్ల నిన్న ఒక్కరోజే కోవిడ్ వల్ల తూర్పు గోదావరి లో ఆరుగురు, నెల్లూరు లో ఆరుగురు, అనంతపూర్ లో నలుగురు, చిత్తూర్ లో నలుగురు, శ్రీకాకుళం లో ముగ్గురు, పశ్చిమ గోదావరిలో ముగ్గురు, గుంటూరు లో ఇద్దరు, కృష్ణ లో ఇద్దరు, కర్నూల్ లో ఇద్దరు, విశాఖపట్నం లో ఇద్దరు, విజయనగరంలో ఇద్దరు, ప్రకాశంలో జిల్లాలో ఒక్క రు చొప్పున మొత్తం 37 మంది మరణించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,616కి చేరింది. నిన్న ఒక్క రోజే 4,421 మంది కరోనా నుంచి కోలుకోగా.. ఇప్పటి వరకు కోలుకున్న వారి సంఖ్య 9,31,839కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 81,471 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రంలో 1,59,31,722 శాంపిల్స్ ను పరీక్షించారు.