ఏపీ కరోనా బులిటెన్ విడుదల.. కొత్తగా ఎన్ని కేసులంటే..
1160 Corona Cases In AP. ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. మళ్లీ కొత్త కేసులు
By Medi Samrat Published on
21 Nov 2020 11:51 AM GMT

ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు మళ్లీ పెరిగాయి. తాజా కరోనా బులెటిన్ ప్రకారం.. మళ్లీ కొత్త కేసులు వెయ్యికి పైగా నమోదు అయ్యాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 68,307 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 1,160 కొత్త పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. కరోనాబారినపడి ఏడుగురు మృతిచెందారు.
ఇదే సమయంలో 1,765 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. తాజా కరోనా నిర్ధారణ పరీక్షలు కలుపుకొని ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా టెస్ట్‌ల సంఖ్య 95,43,177కు చేరింది. తాజాగా చిత్తూరులో ఇద్దరు, అనంతపూర్‌లో ఒక్కరు, తూర్పుగోదావరిలో ఒక్కరు, గుంటూరులో ఒక్కరు, కడపలో ఒక్కరు, కృష్ణలో ఒక్కరు మరణించారు.
ఇప్పటి వరకు నమోదైన పాజిటివ్ కేసుల సంఖ్య 8,61,092కు చేరుకోగా.. ఇప్పటి వరకు కోలుకున్నవారి సంఖ్య 8,39,395కు పెరిగింది. ఇక 6,927 మంది ఇప్పటి వరకు కరోనాబారినపడి మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,770 యాక్టివ్ కేసులు ఉన్నాయి.
Next Story