ఏపీలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 49,568 పరీక్షలు నిర్వహించగా.. 1,125 కేసులు నిర్ధారణ అయినట్లు మంగళవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,31,974కి చేరింది. నిన్న కరోనా వల్ల 9 మంది మృత్యువాత పడ్డారు. దీంతో రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,019కి చేరింది. 24 గంటల వ్యవధిలో 1,356 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,03,543కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 14,412 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 2,74,13,209 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.