ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. జూన్ 7 నుంచి ఏపీలో టెన్త్ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులకు ఆరోగ్యంతో పాటు మంచి భవిష్యత్ అందించాలన్నదే తమ ఉద్దేశమని మంత్రి అన్నారు. ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలకు విద్యార్థులు ప్రిపేర్ అవ్వాలని.. రాబోయే రోజుల్లో కరోనా పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఇక కరోనా కట్టడికి సీఎం జగన్ చేపట్టిన చర్యలు మంచి ఫలితాలను ఇస్తున్నాయని మంత్రి అన్నారు.
ఇదిలావుంటే.. ఏపీలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గత కొన్ని రోజులుగా వేలల్లో కేసులు నమోదవడంతో పాటు మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో ఏపీలో పాక్షిక లాక్‌డౌన్ విధించింది ప్రభుత్వం. ఈ నేఫథ్యంలోనే ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పది పరీక్షలు మాత్రం జరుగుతాయంటూ చెబుతున్నారు. ఇంటర్ పరీక్షల మాదిరిగానే పది పరీక్షలు కూడా వాయిదా పడతాయా.. లేదా జరుగుతాయా.. చూడాలి మరి.