ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 21,010 పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 108 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు సోమవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,72,081కి చేరింది. కరోనా వల్ల కృష్ణా జిల్లాలో ఒకరు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,467గా ఉంది.
గడిచిన 24 గంటల వ్యవధిలో 141 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,58,631కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,878 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,07,98,406 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. చిత్తూరు, తూర్పు గోదావరి, విశాఖపట్నంలో కరోనా కేసులు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. మరో వైపు ఓమిక్రాన్ వేరియంట్ కేసు రాష్ట్రంలో నమోదు కావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వేరియంట్ వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు పలు చర్యలు తీసుకుంటోంది.