ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభణ సృష్టిస్తోంది. రాష్ట్రంలో కరోనా కేసులు సంఖ్య మళ్లీ 10 వేలకుపైగా నమోదయ్యాయి. కేసులు పెరగుతుండటంతో మరణాలు కూడా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 39,296 పరీక్షలు నిర్వహించగా.. 10,310 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు ఆదివారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 22,70,491కి చేరింది.
కరోనా వల్ల నిన్న పన్నెండు మంది మృత్యువాత పడ్డారు. కోవిడ్ వల్ల కడప మరియు విశాఖపట్నంలలో ముగ్గురు, నెల్లూరు లో ఇద్దరు, చిత్తూరు, గుంటూరు, ప్రకాశం మరియు శ్రీకాకుళంలలో ఒక్కొక్క రు చొప్పున మరణించారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,606గా ఉంది. 24 గంటల వ్యవధిలో 9,692 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 21,39,854కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,16,031 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,24,45,428 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.