ఆంధ్రప్రదేశ్లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా 28,670 పరీక్షలు నిర్వహించగా.. 103 కొత్త పాజిటివ్ కేసులు నిర్ధారణ అయినట్లు బుధవారం సాయంత్రం విడుదల చేసిన హెల్త్ బులిటెన్లో రాష్ట్ర వైద్యా రోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,76,077కి చేరింది. కరోనా వల్ల నిన్న ఇద్దరు మృతి చెందారు. రాష్ట్రంలో కరోనా మహమ్మారి వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 14,483గా ఉంది. 24 గంటల వ్యవధిలో 175 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 20,60,236కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 1,358 యాక్టివ్ కేసులున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 3,10,67,410 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది.