ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న ఒమిక్రాన్ ఉధృతి.. ఒక్క రోజే 10 కేసులు

10 New Omicron Cases Reported In AP. ఆంధ్రప్రదేశ్ ఒమిక్రాన్ కేసులు ఒక్క రోజే 10 కేసులు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది.

By Medi Samrat  Published on  29 Dec 2021 10:40 AM GMT
ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న ఒమిక్రాన్ ఉధృతి.. ఒక్క రోజే 10 కేసులు

ఆంధ్రప్రదేశ్ ఒమిక్రాన్ కేసులు ఒక్క రోజే 10 కేసులు నమోదు కావడం ఆందోళన పెంచుతోంది. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య 16కి చేరింది. కొత్త ఒమిక్రాన్ కేసులకు సంబంధించి ప్రైమరీ కాంటాక్ట్ సంఖ్యపై అధికారులు ఆరా తీస్తున్నారు. వీరంతా నేరుగా విదేశాల నుంచి వచ్చిన వారే అని తెలుస్తోంది. ఈస్ట్ గోదావరి జిల్లాలో 3, అనంతపురం జిల్లాలో 2, కర్నూలు జిల్లాలో 2 కేసులు, చిత్తూరు, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో చెరో కేసు నమోదయ్యాయి. దీంతో ఆయా జిల్లా అధికారులను అప్రమత్తం చేశారు. కువైట్, నైజైరీయా, సౌదీ, అమెరికాల నుంచి ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చిన వారని తెలుస్తోంది. వీరితో ప్రైమరీ కాంటాక్టు లో ఉన్న ఉన్నవారిలో కొందరికి పాజిటివ్ వచ్చినా వారి రిపోర్ట్స్ ఇంకా రావాల్సి ఉంది. ఇటీవల విదేశాల నుంచి వచ్చిన వారిలో సుమారు 100 మంది ఆచూకీ ఇంకా దొరకలేదు.

తెలంగాణలో వెలుగు చూసిన కరోనా ఒమిక్రాన్ కేసుల్లో ఎవరికీ సీరియస్ అవ్వలేదని రాష్ట్ర వైద్యాధికారులు స్పష్టం చేశారు. మందుల అవసరం లేకుండా వారు కోలుకుంటున్నట్లు తెలిపారు. మంగళవారం వరకు 63 ఒమిక్రాన్ కేసులు తెలంగాణలో వెలుగు చూశాయన్నారు. ఒమిక్రాన్ పాజిటివ్ కేసుల్లో ఊపిరితిత్తులు ప్రభావానికి గురి కావడం (లంగ్స్ ఇన్ వాల్ మెంట్) లేదని.. వీరిలో అధిక శాతం (46 మంది) కరోనా టీకాలు తీసుకోలేదని తెలుస్తోందని ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ జి.శ్రీనివాసరావు వెల్లడించారు. ప్యారాసిటమాల్ మాత్రలతోనే రోగులు కోలుకుంటున్నట్లు చెప్పారు. ఎక్కువ శాతం మంది మధ్య వయసు వారే ఉన్నారు. వారికి లక్షణాలు కూడా లేవని తెలిపారు.



Next Story