ప్రేమోన్మాది ఘాతుకం.. ఇద్దరు సజీవ దహనం..
By అంజి Published on 22 Jan 2020 9:49 AM IST
తూర్పుగోదావరి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. తాను ప్రేమించిన అమ్మాయి వేరే పెళ్లి చేసుకుందన్న కోపంతో ఓ ప్రేమోన్మాది ఆమె ఇంటికి నిప్పు పెట్టాడు. ఈ ఘటనలో ఇద్దరు సజీవదహనం కాగా మరో నలుగురికి తీవ్రగాయాలు అయ్యాయి. కడియం మండలం దుల్ల గ్రామంలో ఈ దారుణం జరిగింది.
దుల్ల గ్రామానికి చెందని శ్రీనివాస్.. అదే గ్రామానికి చెందిన యువతిని ప్రేమించాడు. ఆ యువతికి తల్లిదండ్రులు వేరే వివాహం చేశారు. దీంతో శ్రీనివాస్ ఎలాగైన ఆ యువతిపై కోపం తీర్చుకోవాలనున్నాడు. ప్రేమించిన యువతిపై కక్ష సాధించాలనకున్నాడు. మంగళవారం అర్థరాత్రి యువతికి ఇంటికి వచ్చిన శ్రీనివాస్ ఆమె ఇంటిపై పెట్రోల్ పోసి తగలబెట్టాడు. ఇంట్లో అప్పటికే ఆరుగురు నిద్రిస్తున్నారు. వీరిలో ఇద్దరు చిన్నారులు సజీవదహనం కాగా.. అమ్మాయి మేనత సహా మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
అమ్మాయి మేనత్తపై మూడు రోజులక్రితం నిందితుడు శ్రీనివాస్ కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మంగళవారం రాత్రి సమయంలో దుళ్ల పెట్రలో బంక్‌లో నిందితుడు పెట్రోల్ కొనుగోలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉన్నారు.