విషాదం.. నేపాల్‌లో 8 మంది భారతీయులు మృతి

By అంజి  Published on  21 Jan 2020 4:58 PM IST
విషాదం.. నేపాల్‌లో 8 మంది భారతీయులు మృతి

నేపాల్‌లోని ఓ రిసార్ట్‌ గదిలో గ్యాస్‌ లీక్ కావడం వల్ల ఎనిమిది మంది భారతీయ పర్యాటకులు అపస్మారక స్థితిలోకి చేరుకొని మృతి చెందారు. కేరళ రాష్ట్రానికి చెందిన 15 మంది పర్యాటకులు నేపాల్‌కు వెళ్లారు. అక్కడి మంచుకొండలను, నేపాల్‌ అందాలను చూడాలనుకున్నారు. కాగా సోమవారం రాత్రి మకవాన్‌పూర్‌ జిల్లాలోని ఉన్న డామన్‌ అనే టూరిస్ట్‌ ప్రాంతానికి వెళ్లారు. అక్కడే ఉన్న ఎవరెస్ట్‌ పనోరమా రిసార్ట్‌లో నాలుగు గదులను బుక్‌ చేసుకున్నారు. ఒకే గదిలో ఎనిమిది మంది బస చేశారు. రిసార్ట్‌ మేనేజర్‌ తెలిపిన వివరాల ప్రకారం.. రిసార్ట్‌ వచ్చిన పర్యాటకులు గదిలో వెచ్చగా ఉండేందుకు గ్యాస్‌ హీటర్‌ను ఆన్‌ చేశారని తెలిపారు. మరోక గదిలో మరికొందరు ఉన్నారని తెలిపారు. డోర్లు, కిటీకిలు పూర్తిగా మూసివేయడంతో ప్రమాదవశాత్తు గ్యాస్‌లీకవడంతో వారందరూ అపస్మారక స్థితికి చేరకొని మరణించినట్టుగా ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. మృతదేహాలను హెలికాప్టర్‌ ద్వారా హామ్స్‌ ఆస్పత్రికి తరలించినట్టుగా పోలీస్‌ సూపరింటెండెంట్‌ సుశీల్‌ సింగ్‌ రాథౌర్‌ చెప్పారు.

Next Story