కరోనా పుకార్లపై స్పందించిన యాంకర్‌ ఝాన్సీ

By సుభాష్  Published on  6 July 2020 4:01 AM GMT
కరోనా పుకార్లపై స్పందించిన యాంకర్‌ ఝాన్సీ

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. పిల్లల నుంచి వృద్ధుల వరకు ఎవ్వరికిన వదలడం లేదు. ఇక రాజకీయ ప్రజాప్రతినిధులను, సెలబ్రిటీలను సైతం వదిలి పెట్టడం లేదు. ఇటీవల టీవీ, సినిమా షూటింగ్‌లకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడంతో షూటింగ్‌లలో పాల్గొన్న పలువురికి కరోనా సోకింది. ఇక బుల్లితెర షూటింగ్‌లలో పాల్గొంటున్న వారిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకే ఐదారు కరోనా పాజిటివ్‌ నమోదు కాగా, వారితో కాంటాక్ట్‌ అయిన వారు సెల్ఫ్‌ క్వారంటైన్‌లోకి వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో యాంకర్‌ ఝాన్సీకి కరోనా సోకినట్లు ఇటీవల పుకార్లు షికార్లు చేశాయి.

కరోనా పాజిటివ్‌ రావడంతో ఆమె సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. ఇక ఇలాంటి వార్తలపై తాజాగా యాంకర్‌ ఝాన్సీ స్పందించారు. తనకు కరోనా లేదని స్పష్టం చేశారు. ఇటీవల ఓ టీవీ షూటింగ్‌లో పాల్గొనగా, ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఐసోలేషన్‌లో ఉన్నట్లు ఝాన్సీ తెలిపారు. తనకు ఎలాంటి కరోనా లక్షణాలు లేవని, తాను ఇంట్లో తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నట్లు చెప్పారు. కాగా, ఝాన్సీ చేసిన ఓ షోలో పాల్గొన్న ఇద్దరికి కరోనా సోకినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఝాన్సీ సెల్ఫ్‌ ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు సమాచారం.

కాగా, ఇటీవల ప్రారంభమైన షూటింగ్‌ల నేపథ్యంలో ఓ సీరియల్‌ షూటింగ్‌ నిర్వహిస్తుండగా, అందులోనటిస్తున్న ఒకరిద్దరికి కరోనా సోకగా, ఆ షూటింగ్‌ను సైతం నిలిపివేశారు. షూటింగ్‌లకు అనుమతి ఇచ్చిన ప్రభుత్వాలు.. పలు నిబంధనలు జారీ చేసింది. అతి తక్కువ సిబ్బందితో షూటింగ్‌లు జరుపుకోవాలని సూచించింది. ఇలా ఎన్ని నిబంధనలు పాటించినా.. ఇప్పటికే పలువురు కరోనా బారిన పడ్డారు.

Next Story