వాళ్ల అరెస్టుపై ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చిన అన‌సూయ - ఇంత‌కీ ఏమ‌ని స్పందించిందంటే..?

By తోట‌ వంశీ కుమార్‌  Published on  9 March 2020 7:44 AM GMT
వాళ్ల అరెస్టుపై ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చిన అన‌సూయ - ఇంత‌కీ ఏమ‌ని స్పందించిందంటే..?

ఇంత‌ చిన్న విష‌యానికే వారిని అరెస్టు చేస్తారా..? ఆ లెక్క‌న వారిని అరెస్టు చేయ‌డానిక‌న్నా ముందు న‌న్ను అరెస్టు చెయ్యాలి. ఎందుకంటే..? వారు చేసే ప‌నే నేనూ చేస్తున్నా క‌నుక‌. వెంట‌నే వారిని వ‌దిలిపెట్టండి అంటూ యాంక‌ర్ క‌మ్ యాక్ట‌ర్ అన‌సూయ భ‌ర‌ద్వాజ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. అయితే, ఇటీవ‌ల కాలంలో బుల్లితెర ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ చానెళ్ల‌లో ఏ స్పెష‌ల్ షో చూసినా అన‌సూయ ద‌ర్శ‌నం ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇలా అన‌సూయ‌కు వ‌స్తున్న అవ‌కాశాలు, వెన‌కేసుకుంటున్న నాలుగు రాళ్ల గురించి టాలీవుడ్ కోడై ప్ర‌శ్నిస్తోంది.

ఏకంగా జ‌బ‌ర్ద‌స్త్ లొకేష‌న్‌లోనూ ఇదే చ‌ర్చ య‌మ జోరుగా సాగుతోంది. ఇలా వ‌దంతులు దావానంలా వ్యాపిస్తుంటే హైప‌ర్ ఆది మాత్రం ఊరుకుంటాడా..? కామెడీని పండించే వారికి కొత్త కొత్త‌ పంచ్‌లు ఎదురైన‌ట్టు అన‌సూయ వార్త కాస్తా హైప‌ర్ ఆది చెవిన ప‌డింది. ఇంకేముందీ అన‌సూయ సంపాద‌న‌పై త‌న మ‌నసులో నుండి త‌న్నుకొచ్చిన పంచ్‌లకు అక్ష‌ర‌రూపం ఇచ్చి జ‌బ‌ర్ద‌స్త్ స్టేజ్‌పై బుల్లితెర ప్రేక్ష‌కుల‌కు వినిపించేలా చేశాడు. ఆఫ్ కెమెరానే కాకుండా, ఆన్ కెమెరాలోనూ జెన్యూన్‌గా ఉండే అన‌సూయ చేత‌నే ఆ డైలాగ్‌ల‌ను ప‌లికించాడు.

అయితే, తాజాగా ప్ర‌సార‌మైన హైప‌ర్ ఆది జ‌బ‌ర్ద‌స్త్ స్కిట్ ఇంత‌కు ముందు షోల‌కంటే చాలా భిన్నంగా సాగిన సంగ‌తి తెలిసిందే. పోలీస్ గెట‌ప్‌లో వ‌చ్చిన హైప‌ర్ ఆది తోటి కంటెస్టెంట్‌ల‌పై స‌రికొత్త పంచ్‌లు విసురుతూ జ‌బ‌ర్ద‌స్త్ ప్రేక్ష‌కుల‌కు వినోదం పంచే విష‌యంలో స‌ఫ‌లీకృతుడ‌య్యాడ‌నే చెప్పాలి. గ‌తంలో మాదిరే ఈ సారి ప్ర‌సార‌మైన స్కిట్‌లోనూ అన‌సూయ‌కు పోలీస్ క్యారెక్ట‌ర్ ఇచ్చిన హైప‌ర్ ఆది ఆమెకు సంబంధించిన సంపాద‌న విష‌యాన్ని డైలాగ్‌ల రూపంలోఓ అన‌సూయ చేత‌నే చెప్పించాడు.

కాగా, స్కిట్‌లో భాగంగా అన‌సూయ‌కు మాత్ర‌మే సొంతమైన సూయ‌..సూయ‌..సూయ‌.. అన‌సూయ‌.. అట్టా ఎట్టా పుట్టేశావే అన‌సూయ అన్న పాట‌తో ఎంట్రీ ఇస్తుంది. అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ఐపీఎస్ అంటూ హైప‌ర్ ఆది రాసిన డైలాగ్‌ను చెప్తూ నాకు తెలిసిన‌వి మూడే మూడు ఒక‌టి డ్యూటీ.. రెండు డ్యూటీ.. మూడు డ్యూటీ అంటూ డైలాగ్‌ను కంప్లీట్ చేస్తుంది. ఇలా డైలాగ్‌ను కంప్లీట్ చేస్తుంది అన‌సూయ‌.

ఇలా అన‌సూయ డైలాగ్‌ను కంప్లీట్ చేయ‌గానే, ఇటీవ‌ల విజ‌య‌వాడ‌ వ్య‌భిచారం కేసులో ప‌ట్టుబ‌డ్డ ప‌ర‌దేశీ కానిస్టేబుల్ గెట‌ప్‌లో ఖైదీ వేషంలో ఉన్న మరో కంటెస్టెంట్‌ను తీసుకొస్తూ మేడం వీడు చాలా పెద్ద త‌ప్పు చేశాడు మేడం. ఈ ప్రోగ్రామ్‌లో చేస్తూ మ‌రో వేరే ప్రోగ్రామ్‌లో చేయాల‌ని ఆలోచిస్తున్నాడు. అలా చెయ్య‌డం త‌ప్పు క‌దా..? అని ప్ర‌శ్నించ‌గా, వెంట‌నే ఐపీఎస్ గెట‌ప్‌లో ఉన్న అన‌సూయ స్పందిస్తూ అటువంటి వాళ్ల‌ను వ‌దిలెయ్యాలి.. వ‌దిలెయ్యాలి అంటూ ఓపెన్ స్టేట్‌మెంట్ ఇస్తుంది. ఇలా త‌న మాదిరి ఒక ప్రోగ్రామ్‌లోనే కాకుండా.. మ‌రో ప్రోగ్రామ్‌లోనూ చేస్తూ డ‌బ్బులు సంపాదించ‌డం త‌ప్పే కాద‌ని ఇన్‌డైరెక్ట్‌గా చెప్పుకొచ్చింది అన‌సూయ భ‌ర‌ద్వాజ్ ఐపీఎస్‌.

Next Story
Share it