యాంకర్‌ రష్మికి ఉన్న ఫాలోయింగ్‌ గురించి చెప్పాల్సిన పని లేదు. సోషల్‌మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గానే ఉంటుంది. వృత్తి, వ్యక్తిగత విషయాలే కాకుండా అప్పుడప్పుడూ సామాజిక అంశాలపైనా స్పందిస్తుంది. కాగా నేడు(మార్చి8) అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా.. ట్విట్టలో రష్మి పెట్టిన పోస్టు చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు మహిళా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు చెబుతూనే.. దేశంలోని న్యాయవ్యవస్థపై తన మార్క్ సెటైర్లు వేసింది.

భారతదేశంలో ఓ మహిళ 8 ఏళ్ల నుంచి న్యాయం కోసం పోరాటం చేస్తుంది. ఎదురుచూస్తుంది. అలాంటి దేశంలో మనం మహిళా దినోత్సవం జరుపుకుంటున్నాం.. అందరికీ హ్యాపీ ఉమెన్స్‌ డే అంటూ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్‌లో నిర్భయ తల్లి ఆశా దేవి కన్నీరు పెడుతున్న ఫోటోను ఆమె పోస్ట్ చేసింది. దీంతో నెటీజన్లు రెండు వర్గాలుగా విడిపోయారు. రష్మి చేసిన ట్విట్‌ పై కొందరు విమర్శలు చేస్తుండగా.. మరికొందరు ఆమె ట్వీట్‌ను సమర్థిస్తున్నారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.