ఆమని పుట్టినరోజు సందర్భంగా 'అమ్మ‌దీవెన' ఫస్ట్ లుక్ విడుదల

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  18 Nov 2019 5:58 PM IST
ఆమని పుట్టినరోజు సందర్భంగా అమ్మ‌దీవెన ఫస్ట్ లుక్ విడుదల

ల‌క్ష్మీ స‌మ‌ర్ప‌ణ‌లో ల‌క్ష్మ‌మ్మ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్ పై ఎత్తరి చిన‌మార‌య్య‌, ఎత్తరి గుర‌వ‌య్య నిర్మాత‌లుగా శివ ఏటూరి ద‌ర్శ‌క‌త్వంలో సీనియ‌ర్ హీరోయిన్ ఆమ‌ని ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కెతున్న చిత్రం ‘అమ్మ‌దీవెన‌’. ఈ చిత్ర ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ఆమ‌ని పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ప్ర‌సాద్ ల్యాబ్స్‌లో మేయ‌ర్ బొంతు రామ్మోహన్ సతీమణి బొంతు శ్రీ‌దేవి, మాజీ డిప్యూటీ సీఎం రాజ‌య్య‌ విడుద‌ల చేశారు.

నటి ఆమ‌ని మాట్లాడుతూ… నేను ఈ చిత్రంలో లీడ్ రోల్ చేశాను. ఒక త‌ల్లిగా ఎంత రెస్పాన్సిబుల్ గా ఉండాలి అనేది ఈ సినిమాలో చాలా బాగా చూపించాము. ఒక తాగుబోతు మొగుడితో ఐదుగురు పిల్ల‌ల్ని పెట్టుకుని ఎలాంటి ఇబ్బందులు ప‌డుతుంది. ఈ చిత్రాన్ని నిర్మించి ప్రొడ్యూస‌ర్లు వాళ్ళ అమ్మ మీద ప్రేమ‌ని సినిమా ద్వారా తెలియజేస్తున్నారు. శివ‌ ఈ సినిమా చెప్పిన‌ప్పుడు అన్ని సీన్స్ చాలా బావుంటాయి. కొన్ని స‌న్నివేశాలు చాలా న్యాచుర‌ల్‌గా తీశారు. శుభ‌సంక‌ల్పం తర్వాత ఈ సినిమాలోనే డీ గ్లామ‌ర్ పాత్రలో న‌టించాను. మంచి కెమెరామెన్ చాలా అందంగా చూపించారు. మాటలు, స్లాంగ్ అన్నీ బాగా కుదిరాయి. మ్యూజిక్ కూడా చాలా బాగా కుదిరింది. హీరోయిన్ ప‌ల్ల‌వి చాలా బాగా న‌టించారు. పోసానిగారి పాత్ర ఈ సినిమాలోచాలా యాప్ట్‌గా ఉంటుంది. ఈ సినిమాలో న‌టించ‌డం నా అదృష్టంగా భావిస్తున్నాను. నా పుట్టిన‌రోజు నాడు పోస్ట‌ర్ రిలీజ్ కావ‌డం చాలా ఆనందంగా ఉందన్నారు.

Next Story