కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు కరోనా పాజిటివ్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  2 Aug 2020 5:05 PM IST
కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు కరోనా పాజిటివ్‌

దేశంలో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. ధనిక-పేద, చిన్న పెద్ద అన్న తేడా లేకుండా అందరికి సోకుతోంది. తాజాగా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షాకు కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

'కరోనా వైరస్ లక్షణాలు కనిపించడంతో నేను టెస్టులు చేయించుకున్నా. అందులో రిపోర్టు పాజిటివ్ వచ్చింది. నా ఆరోగ్యం బాగానే ఉంది. కానీ, వైద్యుల సలహా మేరకు ఆస్పత్రిలో చేరుతున్నా. కొన్ని రోజులుగా నాతో కలిసిన వారు మీరు కూడా టెస్టులు చేయించుకోండి.’ అని అమిత్ షా ట్వీట్ చేశారు.



Next Story