భారత్‌లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. గత కొద్ది రోజులుగా రికార్డు స్థాయిలో పాజిటివ్‌ కేసులు నమోదు అవుతున్నాయి. చిన్న-పెద్ద, ధనిక-పేద అనే తేడా లేకుండా అందరూ ఈ మహమ్మారి భారిన పడుతున్నారు. మంత్రి కమలా వరుణ్‌ ఆదివారం ఉదయం మృతి చెందారు. యోగి ఆదిత్యనాథ్ కేబినేట్‌లో ఆమె సాంకేతిక విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆమె వయసు 62 సంవత్సరాలు. కరోనాపై పోరులో భాగంగా ప్రభుత్వం చేపట్టిన ప్రతి కార్యక్రమంలోనూ ముందున్నారు.

జూలై 18న ఆమె అనారోగ్యం పాలైయ్యారు. ఆస్పత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా.. కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయింది. అప్పటి నుంచి ఆమె లక్నోలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మృతి చెందారు. ఊపిరితిత్తుల్లో ఇన్‌ఫెక్షన్ పెరగడంతో ఒక్కసారిగా పరిస్థితి క్షీణించింది. వెంటిలేటర్లపై చికిత్స అందించాం. మా వైద్యులు ఆమెను కాపాడేందుకు శతధా ప్రయత్నించారు. కానీ.. ఆదివారం ఆమె తుది శ్వాస విడిచారు అని ఆస్పత్రి డైరెక్టర్ రాధా కృష్ణ వెల్లడించారు. మంత్రి మృతి పట్ల ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్ర దిగ్రాంతి వ్యక్తం చేశారు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *