అమెరికాను వెంటాడుతున్న ‘కరోనా’

By సుభాష్  Published on  27 March 2020 12:19 PM IST
అమెరికాను వెంటాడుతున్న ‘కరోనా’

ముఖ్యాంశాలు

  • అమెరికాలో 83,500 కరోనా కేసులు

  • చైనాలో 81,782 కేసులు

  • ఇటలీలో 80,589

అగ్రరాజ్యం అమెరికాలో కోవిడ్-19 కేసుల సంఖ్య కరోనా పుట్టిన దేశం చైనాను కూడా దాటేసింది. ప్రస్తుతం అమెరికాలో 83,500మంది కరోనావైరస్ బాధితులు ఉన్నారు. ప్రపంచంలో మరే దేశంలో ఇంతమంది బాధితులు లేరు.

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని పట్టిపీడిస్తోంది. కరోనా మరణాల్లో ముందుగా చైనా ఉండగా, తర్వాత ఆ స్థానంలో ఇటలీ చేరింది. అప్పుడు అగ్రరాజ్యమైన అమెరికా సైతం కరోనా కేసుల సంఖ్య చైనాను దాటేసింది. ప్రస్తుతం అమెరికాలో 83వేల 500 మందికి కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఇంతమంది బాధితులు లేరు. జాన్‌ హాప్‌కిన్స్‌ యూనివర్సిటీ గణాంకాల ప్రకారం.. అమెరికాలో కరోనా వైరస్‌ బాధితుల సంఖ్య చైనా, ఇటలీని దాటేసింది. కాగా, 1200 మరణాలతో అమెరికా ఇటలీ, చైనా తర్వాత మూడో స్థానంలో నిలిచింది. అయితే అమెరికాలో కరోనా సోకిన అధిక శాతం మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. చనిపోయే స్థితిలో ఉన్నారని అక్కడి వైద్యులు చెబుతున్నారు.

చైనాలో 81వేల 782 మందికి, ఇటలీలో 80వేల 589 మందికి కరోనా పాజిటివ్‌ రాగా, చైనాలో ఇప్పటి వరకు ఈ మహమ్మారి వల్ల 3291 మంది, ఇటలీలో 8215 మంది మృతి చెందారు. కాగా, కరోనా నియంత్రణ విషయంలో ట్రంప్‌ సర్కార్‌ విఫలం కావడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని ఆ దేశమే విమర్శలు గుప్పిస్తోంది. తొందర్లోనే దేశం మళ్లీ యధాస్థితికి వస్తుందని ట్రరంప్‌ చెబుతున్నప్పటికీ.. చర్యలు మాత్రం అంతంతా మాత్రంగానే ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఇక దేశ వ్యాప్తంగా 5 లక్షల52వేల పరీక్షలు నిర్వహించినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఏప్రిల్‌ 12న, ఈస్టర్‌ సందర్భంగా అన్ని ఆంక్షలు ఎత్తివేయాలనుకున్నట్లు ట్రంప్‌ పేర్కొన్నారు. అయితే వైరస్‌ రోజురోజుకు విజృంభిస్తుండటంతో అది సాధ్యం కాకపోవచ్చని తెలుస్తోంది.

Next Story