'జబర్దస్త్‌'కు కరోనా సెగలు

By సుభాష్  Published on  27 March 2020 5:17 AM GMT
జబర్దస్త్‌కు కరోనా సెగలు

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కాటేస్తోంది. 200 దేశాల్లో కరోనా అతలాకుతలం చేస్తోంది. ఇక భారత్‌లో కూడా కరోనా పాజిటివ్‌ కేసులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక తెలంగాణలో కూడా అంతే జరుగుతోంది. దేశంలో ఇప్పటి వరకు 700లకుపైగా కరోనా కేసులు నమోదయ్యాయి. దేశ వ్యాప్తంగా పాఠశాలలు, సినిమా హాళ్లు, షూటింగ్‌లు వంటివి రద్దయ్యాయి. దేశంలో లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ప్రజలంతా ఇళ్లకే పరిమితం అవుతున్నారు. ఇక తెలుగు బుల్లితెరపై కరోనా ప్రభావం చూపింది. బుల్లితెరకు కూడా కష్టకాలం వచ్చిందనే చెప్పాలి. కరోనా లాక్‌డౌన్‌ కారణంతో జబర్దస్త్‌ ఆర్టిస్టులందరికీ కరోనా భయం పట్టుకుంది. కొత్త ఎపిసోడ్స్‌కు సంబంధించి షూటింగ్‌లు సైతం నిలిపివేసినట్లు తెలుస్తోంది.

లాక్‌డౌన్‌ ప్రభావంతో ఆర్టిస్టులందరూ తమ తమ ఇళ్లకే పరిమితం అయ్యారు. జబర్దస్త్‌ షూటింగ్‌ అంటే తమకు పండగ అని జబర్దస్త్‌నే నమ్ముకుని బతుకుతున్న కొందరు ఆర్టిస్టుల పరిస్థితి దారుణంగా మారింది. వాళ్లంతా ఇళ్లకే పరిమితం అయ్యారు. అటు షూటింగ్‌లు లేక, ఇటు ఈవెంట్స్‌ లేక ఆర్టిస్టులంతా ఆందోళన చెందుతున్నారు. అయితే సుధీర్‌, హైపర్‌ ఆది, అనసూయ, రష్మీ లాంటి స్టార్‌ ఆర్టిస్టులకు ఆర్థిక ఇబ్బందులు పెద్దగా లేకపోయినా.. చిన్న చిన్న ఆర్టిస్టులకు ఇబ్బందులు ఎదురయ్యే పరిస్థితి వచ్చింది. వీరికి కరోనా కాటు, టాక్‌డౌన్‌ పెద్ద దెబ్బేనని చెప్పాలి.

Advertisement

ఎపిసోడ్‌ చొప్పున పేమెంట్‌ను అందుకునే వీరికి షూటింగ్‌లు నిలిచిపోవడంతో భవిష్యత్తులో ఎలా అనే సందేహం కలుగుతోంది. షూటింగ్‌లు లేని కారణంగా యాజమాన్యమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.

కరోనా కారణంగా ఇప్పటికే దేశ వ్యాప్తంగా తీవ్రంగా నష్టపోతోంది. వివిధ రంగాలపై కరోనా ప్రభావం చూపడంతో పెద్ద ఎత్తున నష్టం జరుగుతోంది. నిరుపేదలు సైతం ఇబ్బందుల్లో మునిగిపోతున్నారు. ఎవరు బయటకు వెళ్లలేని పరిస్థితి. లాక్‌డౌన్‌ కారణంగా వ్యాపారులు పెద్ద ఎత్తున నష్టాలు చవిచూడాల్సిన పరిస్థితి దాపురించింది. చైనాలో పుట్టిన ఈ మహమ్మారి మృత్యువును వెంటాడుతోంది.

వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కాటుతో అటు మరణాలు, ఇటు నష్టాలు కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి.

Next Story
Share it