వచ్చేసింది.. త్వరలో వస్తా.. ప్లాస్మా ఇస్తా.!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 13 Aug 2020 7:45 AM ISTప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా.. గత కొద్ది రోజులుగా టాలీవుడ్‌ను కూడా పట్టిపీడిస్తుంది. అటు షూటింగ్‌ల్లో పాల్గొంటున్న సీరియల్ నటీనటులతో పాటు.. ఇటు ఇంటిపట్టున ఉంటున్న నటులు, దర్శకులకు సైతం కరోనా సోకుతోంది. తాజాగా మరో దర్శకుడు ఈ వైరస్ బారిన పడ్డారు.
ఆర్‌ఎక్స్ 100 సినిమాతో టాలీవుడ్‌లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు అజయ్ భూపతికి కరోనా సోకింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. అజయ్ తన ట్వీట్‌లో 'వచ్చేసింది.. త్వరలో వస్తా.. ప్లాస్మా ఇస్తా..' అంటూ రాసుకొచ్చాడు.
ఇదిలావుంటే.. అజయ్ త్వరలో ‘మహా సముద్రం’ అనే మల్టీస్టారర్‌ను తెరకెక్కించనున్నారు. ఇందులో శర్వానంద్, సిద్ధార్థ్‌లు హీరోలుగా నటించనున్నారని తెలుస్తుంది. కథానాయికగా సాయి పల్లవి సైతం ఫిక్సయింది. ఈ మూవీకి సంబంధించిన అధికారిక ప్రకటన ఇప్పటివరకు రానప్పటికీ.. కరోనా గండం నుండి బయటపడ్డ తర్వాతే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనున్నట్లు సమాచారం.
ఇక.. టాలీవుడ్ దర్శకదీరుడు రాజమౌళి కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. ఆయనతో పాటు ఆయన కుటుంబ సభ్యులు కూడా ఈ మహమ్మారిని జయించారు. తాజాగా వారికి నిర్వహించిన పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు రాజమౌళి అభిమానులతో పంచుకున్నారు.