అజయ్ భూపతి.. ఆర్ఎక్స్ 100 సినిమాతో గుర్తింపు సంపాదించుకున్నాడు. కార్తికేయ, పాయల్ రాజ్ పుత్ కెరీర్ లను టర్న్ చేసిన సినిమా అది. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ గా మలచిన అజయ్ భూపతి రెండో సినిమా కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు. మహాసముద్రం పేరుతో అజయ్ భూపతి సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమా కోసం హీరోల వేటలో ఉన్నాడు అజయ్ భూపతి. ఈ సినిమా హీరోల విషయంలో నాగ చైతన్య, శర్వానంద్, రవితేజ పేర్లు వినిపించాయి. ఇప్పటికీ ఏ ఒక్కరి విషయంలోనూ క్లారిటీ రాకుండా పోయింది.

తాజాగా అజయ్ భూపతి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. తన పేరు చెప్పి అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడంటూ ఓ వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను అజయ్ భూపతినని తన కొత్త సినిమాలో హీరోయిన్ గా అవకాశాలు ఇస్తానని చెబుతూ ఓ వ్యక్తి అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడని అజయ్ భూపతి తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్టు చేశాడు. ఆ కంత్రీ వ్యక్తి వాడుతున్న ఫోన్ నెంబర్ ను కూడా షేర్ చేశాడు అజయ్ భూపతి. ఇలాంటి కాల్స్ వస్తే మోసపోకూడదని, తాను క్యాస్టింగ్ లాంటివి నిర్వహిస్తే తప్పకుండా అధికారిక ప్రకటన చేస్తానని వెల్లడించాడు.

“Hello, I filed a Cyber Crime case against a fraudster (7995267901) using my name to trap women in the name of Casting Calls. The official announcements of my films will be out on Trusted sources only. Stay cautious & beware of such incidents happening around (sic).” అంటూ తన ట్విట్టర్ ఖాతాలో చెప్పుకొచ్చాడు అజయ్ భూపతి.

ఓ నటి సదరు ఫోన్ నెంబర్ ను కాంటాక్ట్ చేయగా, అజయ్ భూపతి నిజంగానే తన డీటైల్స్ అడుగుతున్నాడని భావించింది. ఆమెను ఫోటోలు పంపమని, పర్సనల్ డీటైల్స్ పంపమని ఆ మోసగాడు అడిగాడట..! కొన్ని కొన్ని సార్లు నటుడు విజయ్ దేవరకొండ పేరును కూడా ఆ అమ్మాయితో చాటింగ్ లో వాడినట్లు తెలుస్తోంది. ఆ అమ్మాయి దగ్గర నుండి డబ్బులు కూడా లాగాలని భావించాడు. ఈ విషయం అజయ్ భూపతి దాకా వెళ్లడంతో తన పేరును దుర్వినియోగం చేస్తున్నారని భావించి సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించాడు. కేసును రిజిస్టర్ చేశాడు. ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు అతన్ని ట్రేస్ చేస్తున్నారు.

ఆర్ ఎక్స్ 100 సినిమా తర్వాత అజయ్ భూపతి మహా సముద్రం సినిమాను తెరకెక్కించాలని భావించాడు. సమంత, నాగ చైతన్యలను ఈ సినిమాలో నటింపజేయాలని అజయ్ భూపతి భావించాడు.. కానీ కొన్ని కారణాల వలన వారిద్దరూ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. త్వరలోనే అజయ్ భూపతి నటీ నటులు, టెక్నీషియన్స్ గురించి అఫీషియల్ గా అనౌన్స్ చేయనున్నాడు. మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ ను అందుకున్న దర్శకుడికి సెకండ్ సినిమాలో హీరో హీరోయిన్లను సెట్ చేసుకోడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అజయ్ భూపతి మహా సముద్రంలో హీరోగా ఎవరు చేయబోతున్నారో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందేనేమో..!

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.
anadolu yakası escort maltepe escort escort bayan kartal escort ataşehir escort pendik escort bostancı escort kurtköy escort maltepe escort kartal escort
Best10 tipobet