టాలీవుడ్ నటుడు కళ్యాణ్ రామ్ పుట్టినరోజు నేడు. నేటితో 42వ పుట్టినరోజును జరుపుకుంటూ ఉన్నారు. పలువురు ప్రముఖులు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో కళ్యాణ్ రామ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ వస్తున్నారు. వీళ్లందరిలోనూ ఓ స్వీట్ ట్వీట్ తన సోదరుడు నందమూరి తారకరామారావు నుండి అందుకున్నారు కళ్యాణ్ రామ్.

“నాకు అన్నయ్యగా మాత్రమే కాదు. అంత కంటే ఎక్కవ. ఎన్నో ఏళ్లుగా నాకు స్నేహితుడు, మార్గదర్శి, తత్వవేత్త కూడా నువ్వే. హ్యాపీ బర్త్ డే కల్యాణ్ అన్నా.. నువ్వే బెస్ట్” అని ట్వీట్ చేయడం విశేషం.

“More than just being a brother, you’ve been my friend, philosopher and guide over the years. Happy Birthday Kalyan Anna @nandamurikalyan. You truly are the best!” అంటూ ఎన్టీఆర్ ట్వీట్ చేయగానే అభిమానులు ఈ ట్వీట్ ను షేర్ చేయడం మొదలుపెట్టారు. అన్నదమ్ముల మధ్య బంధం గురించి కూడా పలువురు కామెంట్లు చేశారు. #HBDNandamuriKalyanRam, #HappyBirthdayNandamuriKalyanRam ఈ రెండు హ్యాష్ ట్యాగ్ లు ట్విట్టర్ లో వైరల్ అవుతున్నాయి. కళ్యాణ్ రామ్-తారక్ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

కళ్యాణ్ రామ్-ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా రావాలని అభిమానులు ఎప్పటి నుండో ఎదురుచూస్తూ ఉన్నారు. కళ్యాణ్ రామ్ పలు సినిమాలతో బిజీగా ఉండగా.. ఎన్టీఆర్ ఆర్.ఆర్.ఆర్. సినిమాలో నటిస్తూ ఉన్నాడు. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటించనున్నాడు. ప్రస్తుతం మల్లిడి వేణు దర్శకత్వంలో ఓ చిత్రంలో కళ్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్నాడు.

వంశికుమార్ తోట

నాపేరు వంశికుమార్. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, ఆంధ్ర‌జ్యోతిలో పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.