విశాల్ సంస్థ లోనే పని చేస్తూ.. మోసం చేసిన మహిళ

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  5 July 2020 6:42 AM GMT
విశాల్ సంస్థ లోనే పని చేస్తూ.. మోసం చేసిన మహిళ

హీరోగా వరుసగా సినిమాలను చేసుకుంటూ వెళుతున్న విశాల్, నిర్మాతగా కూడా బాగా బిజీగా ఉన్నాడు. విశాల్ ఫిలిం ఫ్యాక్టరీ సంస్థ ఆధ్వర్యంలో సినిమాలను నిర్మిస్తూ ఉన్నాడు. పందెంకోడి-2, ఇరుంబు తిరాయ్, తుప్పారివాలన్ లాంటి సినిమాలను నిర్మిస్తూ ఉన్నాడు. విశాల్ సంస్థలో పని చేస్తున్న ఓ మహిళ పెద్ద మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది.

ఆరు సంవత్సరాలలో 45లక్షల రూపాయలు కాజేసింది. విరుగంబాకమ్ పోలీసు స్టేషన్లో సంస్థ మేనేజర్ ఫిర్యాదు చేశాడు. సదరు మహిళ ఇంకమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కు డబ్బులు కట్టకుండా తన సొంత అకౌంట్ కు డబ్బులను బదిలీ చేసుకుందని మేనేజర్ తెలిపాడు. ఆన్ లైన్ మోసాలపై విశాల్ సినిమాలను తీస్తూ ఉన్నాడు. ఇలాంటి సమయంలో ఆయన ఆఫీసులోనే మోసాలు జరగడం పెద్ద ట్విస్ట్.

విశాల్ ప్రస్తుతం రెండు సినిమాలను నిర్మిస్తూ ఉన్నాడు. చక్ర, డిటెక్టివ్-2 సినిమాలలో నటిస్తూ తన సొంత సంస్థ తరపున నిర్మాణం చేస్తున్నాడు. ఇటీవలే చక్ర సినిమాకు సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది. ఈ సినిమాలో కూడా ఇంటర్నెట్ ద్వారా జరిగే మోసాల గురించి ప్రస్తావించారు. ఈ సినిమాలో శ్రద్ధ శ్రీనాథ్, రెజీనా కసాండ్రాలు కీలక పాత్రల్లో కనిపిస్తూ ఉన్నారు.

స్వాతంత్య్ర దినోత్సవం నాడు చోటుచేసుకునే పెద్ద సైబర్ దొంగతనం గురించి ఈ సినిమాలో చూపించనున్నారు. ఆ సైబర్ దొంగల వెనకాల పడే మిలటరీ ఆఫీసర్ పాత్రలో విశాల్ ఈ సినిమాలో నటించాడు. ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీత దర్శకత్వం వహిస్తూ ఉండగా, ఆనందన్ దర్శకత్వం వహిస్తున్నాడు.

Also Read

Next Story