అర్జున్ కుమార్తె ఐశ్వర్యకు కరోనా పాజిటివ్..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  20 July 2020 9:28 AM GMT
అర్జున్ కుమార్తె ఐశ్వర్యకు కరోనా పాజిటివ్..!

యాక్షన్ కింగ్ అర్జున్ కుమార్తె ఐశ్వర్యకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆమె ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా వెల్లడించింది. తనకు కోవిద్-19 పాజిటివ్ అని వచ్చిందని.. ప్రస్తుతం తాను ఇంట్లోనే క్వారెంటైన్ లో ఉన్నట్లు తెలిపింది. మెడికల్ సిబ్బంది చెప్పిన సూచనలు పాటిస్తూ వస్తున్నానని తెలిపింది. ఈ మధ్య కాలంలో తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించింది. ప్రతి ఒక్కరూ మాస్కులు వేసుకోవాలని కోరింది. తన ఆరోగ్యం కుదుటపడ్డాక తప్పకుండా సమాచారం అందిస్తానని తెలిపింది ఐశ్వర్య అర్జున్. అందరూ జాగ్రత్తగా ఉండాలని కోరింది.

అర్జున్ సర్జా మేనల్లుడైన ధృవ సర్జాకు, అతడి భార్యకు కూడా కరోనా సోకిన సంగతి తెలిసిందే..! కొన్ని రోజులుగా అస్వస్థతగా ఉన్న ఆయన కరోనా టెస్ట్ చేయించుకోవడంతో పాజిటివ్ నిర్ధారణ అయింది. డాక్టర్ల సలహాతో హోం క్వారంటైన్‌లో ఉన్నారు. ఈ మధ్య కన్నుమూసిన కన్నడ నటుడు చిరంజీవి సర్జాకు ధృవ సర్జా సొంత తమ్ముడు. యాక్షన్ కింగ్ అర్జున్ ఇంట్లో పలువురికి కరోనా సోకడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఐశ్వర్య గత కొన్నేళ్లుగా చిత్ర పరిశ్రమలో రాణించాలని భావిస్తోంది. తమిళం, కన్నడలో సినిమాలు చేస్తోంది ఐశ్వర్య. పలువురు ప్రముఖులకు కరోనా సోకుతూ ఉండడంతో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story