ఐశ్వర్యరాయ్‌, కూతురు ఆరాధ్యలకు కరోనా పాజిటివ్‌

By సుభాష్  Published on  12 July 2020 9:48 AM GMT
ఐశ్వర్యరాయ్‌, కూతురు ఆరాధ్యలకు కరోనా పాజిటివ్‌

దేశంలో కరోనా మహ్మమ్మారి తీవ్రంగా వ్యాపిస్తోంది. పుట్టిన శిశుశు నుంచి వృద్ధుల వరకు, అలాగే ప్రతి ఒక్క రంగానికి కూడా కరోనా సెగలు తాకుతున్నాయి. ఇక మహారాష్ట్రలో సైతం విలయతాండవం చేస్తోంది. ఇప్పటికే సినీ ప్రముఖులు ఈ మహమ్మారి బారిన పడ్డారు. తాజాగా టాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌, ఆయన కుమారుడు అభిషేక్‌ బచ్చన్‌లకు కరోనా పాజిటివ్‌ రాగా,వారు చికిత్స పొందుతున్నారు. ఇప్పుడు ఐశ్వర్యరాయ్‌ బచ్చన్‌, బేబీ ఆరాధ్యకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. అక అమితా భార్య జయ బచ్చన్‌కు కరోనా నెగిటివ్‌ వచ్చింది. ఇక బిగ్‌బీ ఫ్యామిలీ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటూ ట్వీట్‌ చేస్తున్నారు.

ప్రస్తుతం అమితాబ్‌, అభిషేక్‌ ఇద్దరూ ముంబైలోని నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం వీరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా, ఉందని, ఎలాంటి భయాందోళన అవసరం లేదని వైద్యులు తెలిపారు.

కాగా, మహారాష్ట్రంలో రోజురోజుకు కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. ప్రభుత్వం కరోనా కట్టడికి ఎన్ని చర్యలు చేపట్టినా.. ఏ మాత్రం తగ్గడం లేదు.

Next Story