కాస్టింగ్ కౌచ్ పై తేజస్వీ షాకింగ్ కామెంట్స్
By తోట వంశీ కుమార్ Published on 13 Jun 2020 12:39 PM ISTకాస్టింగ్ కౌచ్.. సినీ ఇండస్ట్రీలో తరుచుగా వినిపించే మాట. ఇప్పటికే కాస్టింగ్ కౌచ్ పై శ్రీరెడ్డి, సింగర్ చిన్మయితో మరికొంత మంది గళం విప్పారు. తాజాగా తెలుగమ్మాయి తేజస్వి మదివాడ కాస్టింగ్ కౌచ్ పై సంచలన వ్యాఖ్యలు చేసింది. టాలీవుడ్‌లో 90శాతం కాస్టింగ్ కౌచ్ ఉందని షాకింగ్ కామెంట్లు చేసింది. కమిట్‌మెంట్లకు ఓకే చెబితేనే అవకాశాలు వస్తాయని కుండ బద్దలు కొట్టింది. ఇండస్ట్రీలో డేట్ చేద్దాం అని అడిగే వారి కన్నా ఐస్ క్రీబ్ కావాలా అని అడిగేవారు ఎక్కువ అని చెప్పింది.
నన్ను ఎంతో మంది కమిట్మెంట్ అడిగారు. అయితే.. వాటికి నేను ఒప్పుకోకపోవడం వల్లే విజయవంతం కాలేకపోయానంది. కాగా.. కొద్ది మాత్రం ఇండస్ట్రీకి వచ్చే ముందే కమిట్మెంట్‌కు ప్రిపేర్ అయి వస్తున్నారని, అలాంటి వాళ్లే విజయవంతం అవుతున్నారంది. బాంబే హీరోయిన్స్ దేనికైనా ఒప్పుకొంటారనే ఏకైక కారణంతో వారికి అవకాశాలిస్తారు. బాంబే అమ్మాయిలు కమిట్‌మెంట్లకు మానసికంగా సిద్ధపడి వస్తారు. అయితే అందరూ అలా ఉండరని, కొద్ది మంది వల్ల ఇలాంటి చెడ్డ పేరు వస్తుందన్నారు. ఈ విషయం తెలుగు అమ్మాయిలకు, తమిళ అమ్మాయిలకు కూడా తెలుసునని తేజస్విని చెప్పుకొచ్చింది. వర్మ సినిమాలో నటించావు నీవు అలాంటి పనులు చేయలేదంటే ఎలా నమ్మమంటావు అని నా మీద డౌట్ పడ్డారు. నేను అలాంటి దానిని కాదు ఎలా ప్రూవ్ చేసుకోవాలో అర్థం కాలేదని వెల్లడించింది. తాజాగా ఆమె నటించిన చిత్రం కమిట్‌మెంట్. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఈ వ్యాఖ్యలు చేసింది.
క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన తేజస్వి.. ఆరువాత హీరోయిన్‌గా మారింది. హీరోయిన్‌గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. బిగ్ బాస్ రియాలిటీ షోలో పాల్గొనడం ద్వారా బాగా పాపులర్ అయ్యింది.